Tuesday, February 21, 2012

త్యాగరాజు జీవితసందేసం

నాద సుదారసంబిలను నరాక్రుతి ఆయె మనసా!
వేదపురాగమ శాస్త్రమునకు ఆధారమగు ..నాద సుధారసంబు.........

స్వరములు ఆరున్నొకటిఘంటలు
వరరాగము కోదండము
దురనయదేస్యము త్రిగుణము
నిరగతి శరమురా......!
సరస సంగతి సందర్భముగల గిరములురా ధర భజనే భాగ్యమురా ....!
త్యాగరాజుసేవించు,నాద సుదారసంబిలను నరాక్రుతి ఆయె మనసా......!

                       సంగీతవిద్యని మోక్ష విద్యగా భావించి ,నాదాన్ని ఉపాసించి మోక్షాన్ని పొందిన మహనీయుడు త్యాగయ్య.`సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము గలదా?' అని ప్రశ్నిస్తారు త్యాగయ్య`.అంతేకాదు సంగీతానికి ,భక్తికీ అవినాభావముందని భావించిన త్యాగయ్య ``సంగీత జ్ఞానము,భక్తీ వినా సన్మార్గము''లేదని ప్రభోదిస్తారు.``రాగసుధారస పానము చేసి రాజిల్లవే మనసా అని హితవు చెబుతారు.
                             త్యాగయ్య కి ఆరాధనా దైవం రాముడు.రాముడికీ తానూ ఉపాసించే సంగీత కళకి అభేదాన్ని కల్పించుకున్న త్యాగయ్య తానూ ఆలపించే రాగమే రామ కోదండం గా ,సప్తస్వరాలు దానికి వేలాడే ఏడు ఘంటలుగా ,సంగీతానికున్న తుర,నయ,దేశ్య మార్గములనే మూడున్ను ఆ వింటికి మూడు అల్లెతాళ్ళుగా ,రాగ ప్రస్తారాలు రామ బాణం గా భావించి నాదసుదారసమే నరాక్రుతి చెందిదంటారు.సంగీత ప్రపంచం లో ఇది ఒక అపూర్వ కల్పన.

              



No comments:

Post a Comment