Wednesday, February 22, 2012

Sree Raamaavatarana శ్రీ రామావతరణ





శ్రీరామచంద్రమూర్తి శతాబ్దాలనుండి భారతీయులకి ఆరాధ్య దైవం.రామకధని వాల్మికి రచించి  శ్రీ రాముడిని
భారతీయుల హృదయాలలో శ్రీమహావిష్ణువు అవతారంగా,ఒక దైవ స్వరూపంగా ,దైవంగా,ఒక మహాపురుషునిగా విరాజిల్లేట్టు చేసారు.భారతీయులకి శ్రీ రామచంద్రుడు ఆదర్శ మూర్తి.అట్టి మూర్తిని సదా ధ్యానించిన వాడు త్యాగరాజు.ఆయన తన ఆరాధ్యదైవమైన శ్రీరాముని తనకు గల అపారమైన భక్తితో తమ అసాధారణ ప్రతిభని మేళవించి అపూర్వమైన కీర్తనలని సృష్టించారు,తమ కీర్తనలలో రాముని వృత్తాంతం తో బాటు తమ వేదనని ప్రకటిస్తూ వచ్చారు.త్యాగరాజ కీర్తనలలోని రామకధావ్రుత్తన్తాన్నిసాధ్యమైనంత వరకు కదా క్రమంలో సంకలనం చేయడానికి శ్రిరామానుగ్రహంతో చేస్తున్న ఒక ప్రయత్నం ఇది.

                                                         బాల కాండము
                                                       ----------------------
  రా
                                                  శ్రీ  రామావతరణ
       
 ఎవరికై అవతారము ఎత్తితివో
ఇప్పుడైనా తెలుపవయ్యా,రామయ్య !నీవెవరికై అవతారము ఎత్తితివో .....?
అవనికి రమ్మని పిలిచిన మహరాజు
ఏవడో వానికి మ్రొక్కేను ,రామా !నీవు ఎవరికై అవతారము ఎత్తితివో.......?
వేదవర్ణ నీయమౌ నామముతో
విధి రుద్రులకు మేల్మియగు రూపముతో
మొదసదనమగు పటు చరితముతో
మునిరాజ వేషియవ్ త్యాగరాజనుత నీవు ఎవరికై అవతారము ఎత్తితివో.....?

``పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే ......
పరమాత్మ ఏ ఒకరి కోసమో అవతారము ఎత్తడు.మంచి మార్గంలో ఉన్నవారిని ఆదరించి రక్షించడం ,పెడత్రోవ బట్టిన వారిని నయాన ,భయానా బుద్ధి చెప్పి సరియైన మార్గంలోకి తేవడం ఆ పరమాత్ముని కర్తవ్యమ్.ఇది ఆయన అభయ వచనం
.దేవతలా ఆర్తనాదం ,దశరధుని సంతాన కాంక్ష రెండూకలసి రామావతారానికి దోహదం చేసాయి.
రావణుడు పెట్టే బాధలనితట్టుకోలేక శ్రీమహావిష్ణువుని శరణు వేడగా,శ్రీ  మహా విష్ణువు దేవతలకు `క్రూరుడైన రావణుని సమూలంగా నాశనం చేసి మీకు మేలు కలిగిస్తాను,పదకొండు వేల సంవస్చరాలు మనుష్యలోకాన్ని పరిపాలిస్తాను అని అభయం ఇచ్చాడు.రఘుకులపతి అయిన దశరధుడు సంతానం లేక అశ్వమేధ ,పుత్రకామేష్టి యాగాలు చేసాడు.యజ్ణపురుషుడైన విష్ణువు యజ్ణ హవిర్భాగాలు అందుకోడానికి  రాగానే బ్రహ్మాది దేవతలు నారాయణుని అంశతో  దశరదునికి పుత్రులుకలిగితెబావుంటుందనే తమ అక్కంక్ష తెలియజేసారు.తధాస్తు అని విష్ణువు బ్రహ్మాది దేవతలకు సంతోషం కలిగించారు..దేవతల ఆర్తనాదం ,దశరధుని సంతాన కాంక్ష రెండూకలసి రామావతారానికి దోహదం చేసాయి.ఆ రాజీవనయనుడు తన విభూతిని నాలుగు అంశాలుగా విభజించుకుని,
దశరధునే తన తండ్రిగా నిర్ణయించుకుని,లక్ష్మి సమేతంగా భూలోకంలో అవతరించి నరులకు ,సురులకు,మునులకు,సాదుసుజనులకు కల్గిన రాక్షస బాధలను తొలగించద్దనికి మానవుని జీవితం గడిపాడు .ధర్మ,అర్ధ,కామ,మోక్షాలకై మానవుడు ఎలా ఆదర్శ వంతంగా జీవించాలో ఉదాహరణ చూపించాడు.శ్రీ రామ జననం

         అయోధ్యానగారాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పాలిస్తున్న దశరధ మహారాజు కి ముగ్గరు   భార్యలు .వారు కౌసల్య,సుమిత్ర,కైకేయి అయన తన తరువాత రాజ్యాధికారం పొందడానికి పుత్రసంతానం లేదన్నదే పెద్ద లోటు .దైవజ్ఞులు  పుత్రకామేష్టి  యాగం చేస్తే ఫలితం ఉంటుందని సూచించేరు తపోధనుడైన రుష్యశ్రుంగ ముని ఆధ్వైర్యంలో దశరధుడు పుత్రకామేష్టి యాగం,అశ్వమేధ యాగం చిత్త శుద్ధితో  చేశాదు. యాగాలు నిర్విఘ్నంగా పూర్తి కాగానే  సంతృప్తి చెందిన యజ్ఞ పురుషుడు యజ్ఞ కుండం నుండి సాక్షాత్కరించి ,బంగారు పాయస పాత్రని దసరదునికి ఇచ్చి దశరధుని భార్యలకి ఆ పాయసాన్ని పంచమని అజ్ఞాపించాడు .యజ్ఞపురుశుని అజ్ఞానుసారంగా దశరధుడు ఆ ప్రసాదాన్ని రాణులు ముగ్గురికి పంచాదు.
         పన్నెండు నెలలు పూర్తీ అయి మళ్ళీ చైత్రమాసం వచ్చింది .నవమి తిధి శుభ లగ్నం లో పునర్వసు నక్షత్రంలో కౌసల్య కి ఒక మగ శిశువు జన్మించాడు .సాక్షాత్తు శ్రీమహావిష్ణువే దశరధుని ఇంట వతరించారు. విష్ణు అంశాలైన ఆదిశేషుడు  లక్ష్మణుడు గా ,చక్రము  భరతుడు గా శంఖము శత్రుఘ్నుడు గా అవతరించారు. దశరధుడు కోరుకున్నదానికంటే ఎక్కువగానే ఫలితం పొందాడు .భగవన్తుదు మన అర్హతలకి మించి ఎక్కువగానే  ఫలితాన్ని ఇస్తుంటాడు..

                                              నామకరణం
           కుమారులు జన్మించిన పదకొండవ రోజున దశరధుడు తమ కులగురువైన వసిష్టునిచే నామకరణ  మహోత్సవం జరిపించాడు జ్యేష్ట పుత్రుడికి రామచంద్రుడు అని నామకరణం చేయడం లోని ఔచిత్యాన్ని త్యాగరాజు పరమాద్భుతంగా చిత్రీకరించారు.

  ఎవరని నిర్ణయించిరిరా ....నిన్నెత్లారాధించిరిరా ? నరవర....
శివుదవో ?మాధవుదవో?కమలభావుదవో?పరబ్రహ్మవో ?     ఎవరని.........

శివ మంత్రమునకు మా జీవము
మాధవ మంత్రమునకు రా జీవము యీ
వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ ,త్యాగరాజ వినుత ........ఎవెరని.........


`శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః .

అని కదా శ్రుతివచనం ! ఈ హరి హరాత్మక భావం సమన్వయము చేస్తూ ఏర్పడ్డదే రామ నామం .
`ఓం నమో నారాయణాయ '`అనే విష్ణు మంత్రం లోని జీవాక్షరమైన  రకారం
`ఓం నమశ్శివాయ 'అనే శివ మంత్రం లో. పేరిడి పెంచిన వారెవరే ?ని   జీవాక్షరమైన మకారం కలిపితే రామ మంత్రం సిద్ధించిందిఱామ నామానికి సర్వ పాపాలని పోగొట్టే శక్తి ఉంది  ..ఈ నామంనిర్ణయించిన వారు వశిష్ట మహర్షి
   రాముడు లోకానికంటకు సంతోషాన్ని కలిగించెవాదు. .సకల  జీవరాసులపట్ల ప్రేమ కలిగి రఘుకులమునకు
పతాకం వలె  ప్రకాశించాడు
 వేద వర్ణ నీయమైన  రామ  నామంనిర్ణయించిన వారు వశిష్ట మహర్శి అ పేరుకు ఎంతో  మురిసిపోయి  ఆ  నామం ఎలాంటి మహిమ కలదో వివరిస్తూ  నీకు ఈ పేరిడి పెంచిన వారెవరే? వారిని చూపవే అని  శ్రీ రాముడిని వేడుకొన్నారు
   
పేరిడి నిన్ను పెంచిన వారెవరే -వానిని చూపవే ఓ రామయ్యా !

సారసారతర తారక నామమును .... పేరిడి పెంచిన వారెవరే ?

సర్వ మతములకు సమ్మతమైన .. పేరిడి పెంచిన వారెవరే ?

ఘోర పాతకముల గొబ్బు నణచు .. . పేరిడి పెంచిన వారెవరే ?

త్యాగరాజు సదా బాగుగా భజియించు . పేరిడి పెంచిన వారెవరే ?




త్యాగరాజ కులవిభూష !మృదు భాష .....రామ ! నీ సమానమెవరు? 




త్యాగరాజుకి రామ నామనామ మాధుర్యం ఎరిగి  ఆ  సౌఖ్యం  పూర్తిగా అనుభవించిన వారు త్యాగయ్యఽఅయన తొంభై ఆరు కోట్ల రామనామజపం చేసి  రామనామ రుచి ఏమిటో బాగా తెలుసుకున్నారు శివుడికి రామనామ రుచి తెలుసు,ఆ నామం జపించడం వాళ్ళ కలిగే సౌఖ్యం  తెలుసు.  అలాగే తిరువైయ్యారు లో వెలసిన త్యాగేస్వరుడి  అవతారుడైన త్యాగరాజుకు కూడా రామ నామ రుచి,ఆ నామం జపించడం వాళ్ళ కలిగే సుఖం పూర్తిగా తెలుసు.

ఇంత సౌఖ్యమని నే చెప్పజాల
ఎంతో ఏమో ఎవరికి తెలుసునో ,,,,,,,,ఇంత సౌఖ్యమని నే చెప్పజాల

దాంత  సీతాకాంత  కరుణాస్వాంత
స్వాంత ప్రేమాదులకే తెలుసునుగాని ....ఇంత సౌఖ్యమని నే చెప్పజాల

స్వర రాగ లయ సుదారసమనే కండ చక్కెర .మిశ్రమము జేసి
భుజించే శంకరునికి తెలుసును త్యాగరాజ వినుత........  ఇంత సౌఖ్యమని నే చెప్పజాల

 దశరధ మహా రాజు తమ పిల్లకి  తమ   కులగురువైన వశిష్టులవారి గురుత్వం లో ధర్మశాస్త్రాలు  ,ధనుర్వేదం మొదలైన విద్యలు అన్నింటినీ పూర్తిచేయించారు .పిల్లలు అన్నింటా ఆరి తేరారు .
నలుగురిలోనూ రాముడు మహా తేజస్వి ;సత్య పరాక్రముడు ;సర్వ లోక ప్రియుడు ;సర్వదా ప్రీతి కలిగించే దివ్య మంగళ విగ్రహం.అటువంటి రాముడిని త్యాగారాజుతలచుకుని మురిసిపోతూ ,నీ మనసు,నీ సొగసు,నీ దినుసు వేరే రామా! అని కొనియాడుతూ రామిని మంచి రాజవేశిగా కీర్తిస్తున్నాడు
లావణ్య రామ కనులార జూడవే అతి..లావణ్య రామ......
శ్రీ వనితా చిత్త కుముద
శీత కర! శతానన్యజ   !     .లావణ్య రామ......
నీ మనసు నీ సొగసు- నీ దినుసు వేరే
తామస మత దైవమేల త్యాగరాజ నుత దివ్య ........
లావణ్య రామ కనులార జూడవే........

రామ ,లక్ష్మణ ,భరత ,శత్రుఘ్నులు నలుగురు క్రమంగా పెరిగి పదహారేళ్ళ ప్రాయం వారయ్యారు .సకల విద్యలో ఆరితేరారు ఱామలక్ష్మనులు ఒక జంటగా,భరత  శత్రుఘ్నులు ఒక జంటగా ఏంటో ఒద్దికతో ఉన్నారు. 
త్యాగరాజు వారిని చూసి మురిసిపోతూ పలుకు పలుకు తేనెలొలుకు సోదరులున్న రామా ! నీ తో సమానమెవరు ?అని ప్రశ్నిస్తారు . 

రామ ! నీ సమానమెవరు? రఘు వంశోద్దారక ! రామ నీ సమానమెవరు ?

భామా మరువంపుమొలక !భక్తీ యను పంజరపు చిలుక .... రామ ! నీ సమానమెవరు?

పలుకు పలుకులకు  తేనెలొలుకు మాటలాడు సోదరులుగల హరి త్యాగరాజ -కులవిభూష !మృదు సుభాష 


రామ ! నీ సమానమెవరు?

     తన వంశోద్దారకులకు వివాహ వయస్సు వచ్చిందనీ తగిన వదువులను అన్వేషించాలనీ దశరధుడు పెద్దలతో చర్చిస్తున్నాడు.సరిగ్గా ఆ సమయానిలే విశ్వామిత్ర మహర్షి వచ్చారు. మహాత్ముల సంకల్పములకు వికల్పాలున్దవుకడా?వారు సత్య సంకల్పులు. విస్వామిత్రునిరాక శుభ  సూచకం విశ్వామిత్రుడు తాను ఒక యజ్ఞం తలపెట్టానని ,ఆ యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని ,యాగాన్ని రక్షించడానికి రాముడిని తనతో పంపమన్నాడు 


                             







     

             

                                                         




 
  

Tuesday, February 21, 2012

There is perhaps no other classic in the vast religious literature of India that has the same hold upon popular imagination as the Ramayana. While the Sanskrit original of Valmiki stands in a class by itself as an ‘epic-pareil’, poets in the other Indian languages appear to have vied with each other in exploring the rich fields of the ‘Adi Kavi’, to return there from laden with a plentiful harvest of the best and noblest thoughts in literature. Several poets in Indian languages like Kambar (Tamil), Kumara Valmiki (Kannada), Krittivasa (Bengali), Ezhuttachan (Malayalam) and Bhanu Bhakt Acharya (Nepali) became Mahakavis by writing their own versions of the Ramayana. There are Buddhist and Jain versions of the epic and a recent survey made by a Sanskrit scholar showed that nearly 300 poets in India have drawn upon the Ramayana theme for writing Kavyas, plays, champus, poems and prose works.
Tyagaraja’s Ramayana Background
Early in life, Tyagaraja came into contact with the literary beauties and philosophical teachings of the Valmiki Ramayana. A copy of his horoscope contains a remark that his father, Rama Brahmam, was an expert in expounding the Ramayana (Ramayana prasanga nipunulu). His proficiency had been recognized by ruler Tuljaji. According to the Walajapet version of Tyagaraja’s life, Rama Brahmam had initiation into the Rama Taraka Mantra from the head of Marudanallur Math and he in turn, gave initiation to Tyagaraja after the latter was invested with the holy thread. The same account also mentions that while yet a boy, Tyagaraja received a further initiation into the ‘Shadaskhari’ (Six-lettered) mantra of Rama from a saint called Ramakrishnananda (whom Tyagaraja salutes by a verse in “Nowka Charitram”). Nevertheless, Tyagaraja had soaked himself in the inspiration of the Ramayana early in his life and was a confirmed devotee of Rama, owing allegiance to no other Godhead, when he embarked on his mission as a music composer.
Tyagaraja has not composed any single work which can be called his Ramayana but dozens of his kritis contain references to incidents in Ramayana from the Bala Kanda to the Yudha Kanda. He is stated to have composed a music drama called ‘Sitarama Vijayam’ based on the Uttara Kanda but no copy of it is traceable now. The other two operas of his viz. ‘Prahlada Bhakti Vijayam’ and ‘Nowka Charitram’ are on non-Ramayana themes. From his kriti ‘E Paniko (Asaveri) it is clear that he decided to sing the praises of Rama on the lines of Valmiki and other poets. In this song he asks Rama ‘are you wondering why I have taken this birth in this world? This should be known to you by now, Valmiki and others have sung your praises, but will that quench my thirst?” Tyagaraja appears to have studied other versions of the epic like the Adhyatma Ramayana; Sangraha Ramayana, etc. He has taken some ideas from them for introduction in his kritis.
Rama the Supreme Lord
It is possible to arrange the kritis of Tyagaraja dealing with incidents from the Ramayana in the order of the Kandas. But before doing so, one should remember that Tyagaraja does not deal with Rama as an incarnation of Vishnu who walked this earth for re-establishing Dhrama; but as the Eternal, Supreme Lord of the universe whose name was current even before the incarnation of Rama. The spiritual initiation he received early in life from Ramakrishnananda led a unitive experience that lodged itself firmly at the very core of his being. In ‘Vadera’ (Pantuvarali) he exclaims: ‘ This Rama of the solar race, the consort of Sita ,is none else than the same Supreme Being whose name Lord Siva whispered into the ears of the mortals for getting them eternal salvation’, His query in the kriti ‘Itara Daivamulu (Surati) ‘Can I get any good out of the other gods? Rama’ might even smack of his slighting the other Gods of the Hindu Pantheon. But Tyagaraja’s faith that Rama was the Para Brahman, above the functional trio. Brahma, Vishnu and Siva, was unshakable and he has affirmed this in many kritis like ‘Enduni’ (Durbar) and ‘Manasa Sri (Isamanohari).
Bala Kanda
Yet in his kritis he deals with the many incidents in the Valmiki and other Ramayanas as they are found and often gives a refreshingly new and original twist to them. Posing the question why he was born in this mortal world, he asks, in the kriti ‘Elavatara’ (Mukhari): Was it for waging battles with the demons or for ruling Ayodhya? Was it for meeting Thy devotees or for saving the poor, suffering mortals of this world? Or was it for the blessing this Tyagaraja who has composed hundreds of songs in Thy praise in a variety of ragas?”
In ‘Srirama Jayarama’ (yadhukulakambhoji) he sings that he is jealous of Kousalya who ‘could imprint a kiss on the shining cheeks of Rama as a child’ and of Dasaratha’ who could call him affectionately as Rama, my son’. But the luckiest of them all was Viswamitra who had the unique privilege of gloating (uppongu) over the fact that the Lord himself walked behind him! In the Puranas, Visawamitra is well known for performing severe penance and then losing all power in the end for some trifling reason. Tyagaraja avers that this time Viswamitra’s penance was rewarding. In Valmiki, Viswamitra specially asks Dasaratha to send him his “heroic eldest son with side-locks on his temples (Kakapaksha dharma suram jyestam),the idea must have caught Tyagaraja’s imagination and in his sparkling kriti ‘Alakalalla”(Madhyamaavati) he wonders ‘How did the Royal Sage (Viswamitra) rejoice seeing Rama’s locks wave from side to side when he killed Maricha and later broke Siva’s mighty bow at a mere signal from Viswamitra’s eyes?”
The Ahalya incident is cited in several kriti’s as an example of the efficiency of a contact with Ram’s feet. “Sri Ramapadama” (Amrutavarshini) and “Nee pada pankaja” (Begada) interpret the incident in different ways. After the arrival of Rama in Mithila, Tyagaraja in kriti ‘Daya Seyavayya’ (Yadukulakhambhoji) introduces an imaginary scene in which Sita sees Rama walking in the street below her window with Viswamitra and Lakshmana and wonders whether this youngish looking prince can bend the formidable bow of Siva which had defied mighty heroes in the past.  Tyagaraja marvels at Janaka’s luck in being able to wash Rama’s feet with milk and giving his daughter Sita as Rama’s consort.

త్యాగరాజు జీవితసందేసం

నాద సుదారసంబిలను నరాక్రుతి ఆయె మనసా!
వేదపురాగమ శాస్త్రమునకు ఆధారమగు ..నాద సుధారసంబు.........

స్వరములు ఆరున్నొకటిఘంటలు
వరరాగము కోదండము
దురనయదేస్యము త్రిగుణము
నిరగతి శరమురా......!
సరస సంగతి సందర్భముగల గిరములురా ధర భజనే భాగ్యమురా ....!
త్యాగరాజుసేవించు,నాద సుదారసంబిలను నరాక్రుతి ఆయె మనసా......!

                       సంగీతవిద్యని మోక్ష విద్యగా భావించి ,నాదాన్ని ఉపాసించి మోక్షాన్ని పొందిన మహనీయుడు త్యాగయ్య.`సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము గలదా?' అని ప్రశ్నిస్తారు త్యాగయ్య`.అంతేకాదు సంగీతానికి ,భక్తికీ అవినాభావముందని భావించిన త్యాగయ్య ``సంగీత జ్ఞానము,భక్తీ వినా సన్మార్గము''లేదని ప్రభోదిస్తారు.``రాగసుధారస పానము చేసి రాజిల్లవే మనసా అని హితవు చెబుతారు.
                             త్యాగయ్య కి ఆరాధనా దైవం రాముడు.రాముడికీ తానూ ఉపాసించే సంగీత కళకి అభేదాన్ని కల్పించుకున్న త్యాగయ్య తానూ ఆలపించే రాగమే రామ కోదండం గా ,సప్తస్వరాలు దానికి వేలాడే ఏడు ఘంటలుగా ,సంగీతానికున్న తుర,నయ,దేశ్య మార్గములనే మూడున్ను ఆ వింటికి మూడు అల్లెతాళ్ళుగా ,రాగ ప్రస్తారాలు రామ బాణం గా భావించి నాదసుదారసమే నరాక్రుతి చెందిదంటారు.సంగీత ప్రపంచం లో ఇది ఒక అపూర్వ కల్పన.