శ్రీరామచంద్రమూర్తి శతాబ్దాలనుండి భారతీయులకి ఆరాధ్య దైవం.రామకధని వాల్మికి రచించి శ్రీ రాముడిని
భారతీయుల హృదయాలలో శ్రీమహావిష్ణువు అవతారంగా,ఒక దైవ స్వరూపంగా ,దైవంగా,ఒక మహాపురుషునిగా విరాజిల్లేట్టు చేసారు.భారతీయులకి శ్రీ రామచంద్రుడు ఆదర్శ మూర్తి.అట్టి మూర్తిని సదా ధ్యానించిన వాడు త్యాగరాజు.ఆయన తన ఆరాధ్యదైవమైన శ్రీరాముని తనకు గల అపారమైన భక్తితో తమ అసాధారణ ప్రతిభని మేళవించి అపూర్వమైన కీర్తనలని సృష్టించారు,తమ కీర్తనలలో రాముని వృత్తాంతం తో బాటు తమ వేదనని ప్రకటిస్తూ వచ్చారు.త్యాగరాజ కీర్తనలలోని రామకధావ్రుత్తన్తాన్నిసాధ్యమైనంత వరకు కదా క్రమంలో సంకలనం చేయడానికి శ్రిరామానుగ్రహంతో చేస్తున్న ఒక ప్రయత్నం ఇది.
బాల కాండము
----------------------
రా
శ్రీ రామావతరణ
ఎవరికై అవతారము ఎత్తితివో
ఇప్పుడైనా తెలుపవయ్యా,రామయ్య !నీవెవరికై అవతారము ఎత్తితివో .....?
అవనికి రమ్మని పిలిచిన మహరాజు
ఏవడో వానికి మ్రొక్కేను ,రామా !నీవు ఎవరికై అవతారము ఎత్తితివో.......?
వేదవర్ణ నీయమౌ నామముతో
విధి రుద్రులకు మేల్మియగు రూపముతో
మొదసదనమగు పటు చరితముతో
మునిరాజ వేషియవ్ త్యాగరాజనుత నీవు ఎవరికై అవతారము ఎత్తితివో.....?
``పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే ......
పరమాత్మ ఏ ఒకరి కోసమో అవతారము ఎత్తడు.మంచి మార్గంలో ఉన్నవారిని ఆదరించి రక్షించడం ,పెడత్రోవ బట్టిన వారిని నయాన ,భయానా బుద్ధి చెప్పి సరియైన మార్గంలోకి తేవడం ఆ పరమాత్ముని కర్తవ్యమ్.ఇది ఆయన అభయ వచనం
.దేవతలా ఆర్తనాదం ,దశరధుని సంతాన కాంక్ష రెండూకలసి రామావతారానికి దోహదం చేసాయి.
రావణుడు పెట్టే బాధలనితట్టుకోలేక శ్రీమహావిష్ణువుని శరణు వేడగా,శ్రీ మహా విష్ణువు దేవతలకు `క్రూరుడైన రావణుని సమూలంగా నాశనం చేసి మీకు మేలు కలిగిస్తాను,పదకొండు వేల సంవస్చరాలు మనుష్యలోకాన్ని పరిపాలిస్తాను అని అభయం ఇచ్చాడు.రఘుకులపతి అయిన దశరధుడు సంతానం లేక అశ్వమేధ ,పుత్రకామేష్టి యాగాలు చేసాడు.యజ్ణపురుషుడైన విష్ణువు యజ్ణ హవిర్భాగాలు అందుకోడానికి రాగానే బ్రహ్మాది దేవతలు నారాయణుని అంశతో దశరదునికి పుత్రులుకలిగితెబావుంటుందనే తమ అక్కంక్ష తెలియజేసారు.తధాస్తు అని విష్ణువు బ్రహ్మాది దేవతలకు సంతోషం కలిగించారు..దేవతల ఆర్తనాదం ,దశరధుని సంతాన కాంక్ష రెండూకలసి రామావతారానికి దోహదం చేసాయి.ఆ రాజీవనయనుడు తన విభూతిని నాలుగు అంశాలుగా విభజించుకుని,
దశరధునే తన తండ్రిగా నిర్ణయించుకుని,లక్ష్మి సమేతంగా భూలోకంలో అవతరించి నరులకు ,సురులకు,మునులకు,సాదుసుజనులకు కల్గిన రాక్షస బాధలను తొలగించద్దనికి మానవుని జీవితం గడిపాడు .ధర్మ,అర్ధ,కామ,మోక్షాలకై మానవుడు ఎలా ఆదర్శ వంతంగా జీవించాలో ఉదాహరణ చూపించాడు.శ్రీ రామ జననం
అయోధ్యానగారాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పాలిస్తున్న దశరధ మహారాజు కి ముగ్గరు భార్యలు .వారు కౌసల్య,సుమిత్ర,కైకేయి అయన తన తరువాత రాజ్యాధికారం పొందడానికి పుత్రసంతానం లేదన్నదే పెద్ద లోటు .దైవజ్ఞులు పుత్రకామేష్టి యాగం చేస్తే ఫలితం ఉంటుందని సూచించేరు తపోధనుడైన రుష్యశ్రుంగ ముని ఆధ్వైర్యంలో దశరధుడు పుత్రకామేష్టి యాగం,అశ్వమేధ యాగం చిత్త శుద్ధితో చేశాదు. యాగాలు నిర్విఘ్నంగా పూర్తి కాగానే సంతృప్తి చెందిన యజ్ఞ పురుషుడు యజ్ఞ కుండం నుండి సాక్షాత్కరించి ,బంగారు పాయస పాత్రని దసరదునికి ఇచ్చి దశరధుని భార్యలకి ఆ పాయసాన్ని పంచమని అజ్ఞాపించాడు .యజ్ఞపురుశుని అజ్ఞానుసారంగా దశరధుడు ఆ ప్రసాదాన్ని రాణులు ముగ్గురికి పంచాదు.
పన్నెండు నెలలు పూర్తీ అయి మళ్ళీ చైత్రమాసం వచ్చింది .నవమి తిధి శుభ లగ్నం లో పునర్వసు నక్షత్రంలో కౌసల్య కి ఒక మగ శిశువు జన్మించాడు .సాక్షాత్తు శ్రీమహావిష్ణువే దశరధుని ఇంట వతరించారు. విష్ణు అంశాలైన ఆదిశేషుడు లక్ష్మణుడు గా ,చక్రము భరతుడు గా శంఖము శత్రుఘ్నుడు గా అవతరించారు. దశరధుడు కోరుకున్నదానికంటే ఎక్కువగానే ఫలితం పొందాడు .భగవన్తుదు మన అర్హతలకి మించి ఎక్కువగానే ఫలితాన్ని ఇస్తుంటాడు..
నామకరణం
కుమారులు జన్మించిన పదకొండవ రోజున దశరధుడు తమ కులగురువైన వసిష్టునిచే నామకరణ మహోత్సవం జరిపించాడు జ్యేష్ట పుత్రుడికి రామచంద్రుడు అని నామకరణం చేయడం లోని ఔచిత్యాన్ని త్యాగరాజు పరమాద్భుతంగా చిత్రీకరించారు.
ఎవరని నిర్ణయించిరిరా ....నిన్నెత్లారాధించిరిరా ? నరవర....
శివుదవో ?మాధవుదవో?కమలభావుదవో?పరబ్రహ్మవో ? ఎవరని.........
శివ మంత్రమునకు మా జీవము
మాధవ మంత్రమునకు రా జీవము యీ
వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ ,త్యాగరాజ వినుత ........ఎవెరని.........
`శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః .
అని కదా శ్రుతివచనం ! ఈ హరి హరాత్మక భావం సమన్వయము చేస్తూ ఏర్పడ్డదే రామ నామం .
`ఓం నమో నారాయణాయ '`అనే విష్ణు మంత్రం లోని జీవాక్షరమైన రకారం
`ఓం నమశ్శివాయ 'అనే శివ మంత్రం లో. పేరిడి పెంచిన వారెవరే ?ని జీవాక్షరమైన మకారం కలిపితే రామ మంత్రం సిద్ధించిందిఱామ నామానికి సర్వ పాపాలని పోగొట్టే శక్తి ఉంది ..ఈ నామంనిర్ణయించిన వారు వశిష్ట మహర్షి
రాముడు లోకానికంటకు సంతోషాన్ని కలిగించెవాదు. .సకల జీవరాసులపట్ల ప్రేమ కలిగి రఘుకులమునకు
పతాకం వలె ప్రకాశించాడు
వేద వర్ణ నీయమైన రామ నామంనిర్ణయించిన వారు వశిష్ట మహర్శి అ పేరుకు ఎంతో మురిసిపోయి ఆ నామం ఎలాంటి మహిమ కలదో వివరిస్తూ నీకు ఈ పేరిడి పెంచిన వారెవరే? వారిని చూపవే అని శ్రీ రాముడిని వేడుకొన్నారు
పేరిడి నిన్ను పెంచిన వారెవరే -వానిని చూపవే ఓ రామయ్యా !
సారసారతర తారక నామమును .... పేరిడి పెంచిన వారెవరే ?
సర్వ మతములకు సమ్మతమైన .. పేరిడి పెంచిన వారెవరే ?
ఘోర పాతకముల గొబ్బు నణచు .. . పేరిడి పెంచిన వారెవరే ?
త్యాగరాజు సదా బాగుగా భజియించు . పేరిడి పెంచిన వారెవరే ?
త్యాగరాజ కులవిభూష !మృదు భాష .....రామ ! నీ సమానమెవరు?
త్యాగరాజుకి రామ నామనామ మాధుర్యం ఎరిగి ఆ సౌఖ్యం పూర్తిగా అనుభవించిన వారు త్యాగయ్యఽఅయన తొంభై ఆరు కోట్ల రామనామజపం చేసి రామనామ రుచి ఏమిటో బాగా తెలుసుకున్నారు శివుడికి రామనామ రుచి తెలుసు,ఆ నామం జపించడం వాళ్ళ కలిగే సౌఖ్యం తెలుసు. అలాగే తిరువైయ్యారు లో వెలసిన త్యాగేస్వరుడి అవతారుడైన త్యాగరాజుకు కూడా రామ నామ రుచి,ఆ నామం జపించడం వాళ్ళ కలిగే సుఖం పూర్తిగా తెలుసు.
ఇంత సౌఖ్యమని నే చెప్పజాల
ఎంతో ఏమో ఎవరికి తెలుసునో ,,,,,,,,ఇంత సౌఖ్యమని నే చెప్పజాల
దాంత సీతాకాంత కరుణాస్వాంత
స్వాంత ప్రేమాదులకే తెలుసునుగాని ....ఇంత సౌఖ్యమని నే చెప్పజాల
స్వర రాగ లయ సుదారసమనే కండ చక్కెర .మిశ్రమము జేసి
భుజించే శంకరునికి తెలుసును త్యాగరాజ వినుత........ ఇంత సౌఖ్యమని నే చెప్పజాల
దశరధ మహా రాజు తమ పిల్లకి తమ కులగురువైన వశిష్టులవారి గురుత్వం లో ధర్మశాస్త్రాలు ,ధనుర్వేదం మొదలైన విద్యలు అన్నింటినీ పూర్తిచేయించారు .పిల్లలు అన్నింటా ఆరి తేరారు .
నలుగురిలోనూ రాముడు మహా తేజస్వి ;సత్య పరాక్రముడు ;సర్వ లోక ప్రియుడు ;సర్వదా ప్రీతి కలిగించే దివ్య మంగళ విగ్రహం.అటువంటి రాముడిని త్యాగారాజుతలచుకుని మురిసిపోతూ ,నీ మనసు,నీ సొగసు,నీ దినుసు వేరే రామా! అని కొనియాడుతూ రామిని మంచి రాజవేశిగా కీర్తిస్తున్నాడు
లావణ్య రామ కనులార జూడవే అతి..లావణ్య రామ......
శ్రీ వనితా చిత్త కుముద
శీత కర! శతానన్యజ ! .లావణ్య రామ......
నీ మనసు నీ సొగసు- నీ దినుసు వేరే
తామస మత దైవమేల త్యాగరాజ నుత దివ్య ........
లావణ్య రామ కనులార జూడవే........రామ ,లక్ష్మణ ,భరత ,శత్రుఘ్నులు నలుగురు క్రమంగా పెరిగి పదహారేళ్ళ ప్రాయం వారయ్యారు .సకల విద్యలో ఆరితేరారు ఱామలక్ష్మనులు ఒక జంటగా,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ఏంటో ఒద్దికతో ఉన్నారు.
త్యాగరాజు వారిని చూసి మురిసిపోతూ పలుకు పలుకు తేనెలొలుకు సోదరులున్న రామా ! నీ తో సమానమెవరు ?అని ప్రశ్నిస్తారు .
రామ ! నీ సమానమెవరు? రఘు వంశోద్దారక ! రామ నీ సమానమెవరు ?
భామా మరువంపుమొలక !భక్తీ యను పంజరపు చిలుక .... రామ ! నీ సమానమెవరు?
పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు సోదరులుగల హరి త్యాగరాజ -కులవిభూష !మృదు సుభాష
రామ ! నీ సమానమెవరు?
తన వంశోద్దారకులకు వివాహ వయస్సు వచ్చిందనీ తగిన వదువులను అన్వేషించాలనీ దశరధుడు పెద్దలతో చర్చిస్తున్నాడు.సరిగ్గా ఆ సమయానిలే విశ్వామిత్ర మహర్షి వచ్చారు. మహాత్ముల సంకల్పములకు వికల్పాలున్దవుకడా?వారు సత్య సంకల్పులు. విస్వామిత్రునిరాక శుభ సూచకం విశ్వామిత్రుడు తాను ఒక యజ్ఞం తలపెట్టానని ,ఆ యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని ,యాగాన్ని రక్షించడానికి రాముడిని తనతో పంపమన్నాడు